అంతర్జాతీయం

బెదిరింపులు కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 8: అగ్ర రాజ్యమైన అమెరికా తన బెదిరింపు ధోరణుల ద్వారా మరో అంతర్జాతీయ సంక్షోభానికి ఆజ్యం పోస్తుందని చైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమ విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన చైనా ఈ రకమైన చేష్టలను కట్టిపెట్టాలని హితవు పలికింది. అలాగే 2015 నాటి పరిమితులు దాటి యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ చేపట్టడం పట్ల కూడా విచారణ వ్యక్తం చేసింది. ప్రస్తుత సంక్షోభాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలే తప్ప అగ్నికి ఆజ్యం పోసే చందంగా వ్యవహరించ కూడదని గట్టిగా తెలిపింది. సంబంధిత దేశాలు సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలని చైనా తెలిపింది. 2015 నాటి అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినప్పటి నుంచి ఈ సమస్య ముదురుతూ వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యవహారశైలితో పాటు ఇరాన్ దారికి తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా అంతర్జాతీయ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఎప్పటికప్పుడు అమెరికా తీసుకుంటున్న ప్రతికూల చర్యలే సమస్యను తీవ్రతరం చేశాయని అభిప్రాయ పడ్డ చైనా అగ్రరాజ్య ఆంక్షలకు విరుద్ధంగా ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకునే విషయంలో వౌనమే వహించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తక్షణమే జోక్యం చేసుకొని 2015 నాటి తీర్మానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చైనా విదేశాంగ ప్రతినిథి జంగ్ షువాంగ్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా తీవ్ర స్థాయిలో తెస్తున్న ఒత్తిడే ఈ సంక్షోభానికి ప్రధానంగా కారణం అవుతుందని ఆయన అన్నారు. ఒప్పందం నుంచి ఏక పక్షంగా తప్పుకోవడమే కాకుండా, పరిమితికి మంచిన రీతిలో ఇరాన్‌పై ఆంక్షలు విధించడం కూడా ఆ దేశ నాయకత్వం ధిక్కార ధోరణిని కనబరచడానికి కారణం అయిందన్నారు. చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఇరాన్‌తో సాధారణం సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే తమ న్యాయ పరమైన హక్కులను, ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.