అంతర్జాతీయం

సుంకాలపై వెనక్కి తగ్గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్ : అమెరికా ఉత్పత్తులపై భారత్ అనుసరిస్తున్న వైఖరిపై అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుపడ్డారు. తమ దేశ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు ‘ఇకపై ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన మంగళవారంనాడు వ్యాఖ్యానించారు. జపాన్‌లోని ఒసాకాలో జూన్ 28న జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య రంగంతోపాటు పలు అంశాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు తద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ఒక అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, జీ-20 శిఖరాగ్ర సదస్సు జరిగి రెండు వారాలు కూడా పూర్తికాకముందే తమ దేశ ఉత్పత్తులపై పన్నులను ప్రకటించడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ వైఖరిపై తాజాగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘్భరత్ దీర్ఘకాలిక ప్రయోజనాలతో అమెరికా ఉత్పత్తులపై సుంకాలను విధిస్తోంది. ఇకపై ఇది ఎంతమాత్రం అమోదయోగ్యం కాదు’ అని అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఒక ట్వీట్ ద్వారా హెచ్చరించారు. ఇదిలావుండగా అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్‌బుర్ రాస్, ఇంధన శాఖ కార్యదర్శి రిక్ పెర్రీ వాషింగ్టన్ డీసీలో భారత్ త్వరలో నిర్వహించే ఒక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. తమ దేశ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న అత్యధిక పన్నులపై ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే అందుకు వాణిజ్యపరంగా జరిగే ఒప్పందాలే అత్యంత కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా అమెరికా ఉత్పత్తులపై భారత్ అనుసరిస్తున్న వైఖరి ఈ రెండు దేశాల మధ్య మరింత అగాధాన్ని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. జీ-20 శిఖరాగ్ర సదస్సులో మోదీతో మాట్లాడడానికి ముందు అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ..‘్భరత్‌లో మా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలపై వాస్తవాలపై మాట్లాడాలని అనుకుంటున్నాను. చాలా ఏళ్లుగా అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఎక్కువ పన్నులను గమనిస్తున్నాను. వాటికి తోడు ఇటీవల మరికొన్నింటిపై సుంకాలు పెంచిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. తక్షణం ఈ పన్నులను ఉపసంహరించుకోవాలి’ అని పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్, పప్పుదినుసులు వంటి 28 ఉత్పత్తుల దిగుమతిపై భారత్ అత్యధిక సుంకాలను విధించింది.