అంతర్జాతీయం

ఇద్దరు భారతీయులకు దుబాయ్ లాటరీ పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూలై 9: దుబాయ్‌లో ఇద్దరు భారతీయులకు నిధుల పంట పండింది. ఒక మిలియన్ డాలర్ల చొప్పున భారీ లాటరీ వీరి సొంతమైంది. అలాగే మరి ఒకరికి లగ్జరీ కారు కూడా బహుమతి లభించింది. జయగుప్తా, రవి రాంచంద్ బచానీ అనే ఇద్దరు భారతీయులు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీలో గెలుపొందారని గల్ఫ్ న్యూస్ తెలిపింది. దుబాయ్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న 71 ఏళ్ళ జయా గుప్తా మాట్లాడుతూ ఆ దేవుడి కృప, తన తల్లి దయ వల్లే ఈ అదృష్టం తనకు దక్కిందని తెలిపారు. గత 35 ఏళ్ళుగా దుబాయ్‌లో ఉంటున్న ఆమె 15 సంవత్సరాల నుంచి ఈ లాటరీ టిక్కెట్ కొంటూనే ఉన్నానని వెల్లడించారు. తొలి సారి ఈ టిక్కెట్లు అమ్మే ఈ బాలికలు తనకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పే వారని ఈ సారి మాత్రం టిక్కెట్ వచ్చిన అమ్మాయి చేతే టిక్కెట్ తీయించానని, గెలుపొందానని ఆమె చెప్పారు.
ఇంత భారీ మొత్తంతో ఏమి చేయాలో ఇప్పటికిప్పుడే తనకు తోచడం లేదన్నారు. తనకు కొన్ని అప్పులు ఉన్నాయని, ముందు వాటిని తీర్చేస్తానని, మిగతా మొత్తాన్ని వ్యాపారంలో పెట్టుబడులు పెడతానని చెప్పారు. మరి కొంత మొత్తాన్ని ఛారిటీకి విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఈ లాటరీ గెలుచుకున్న మరో విజేత 37 ఏళ్ళ బచానీ మాట్లాడుతూ తాను 14 ఏళ్ళుగా దుబాయ్‌లో ఉంటున్నానని, వస్త్ర వ్యాపారం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తాను డాలర్ మిలియనీర్‌నన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.