అంతర్జాతీయం

జపాన్ నిర్ణయంతో వాణిజ్య సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూలై 10: దక్షిణ కొరియా సాంకేతిక రంగంలో కీలకమైన రసాయనాల ఎగుమతులపై నిషేధం విధించాలన్న జపాన్ నిర్ణయాన్ని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జేయిన్ తీవ్రంగా తప్పుపట్టారు. జపాన్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా వాణిజ్య రంగంలో సంక్షోభాలకు దారి తీస్తుందనీ, ఇటువంటి నిర్ణయాల వల్ల వివాదాలు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సియోల్‌లో సాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే గ్రూప్, హుండయ్ మోటార్ కార్పొరేషన్, లొటె గ్రూప్ తదితర సంస్థల ప్రతినిధులతో టోక్యో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ సమావేశమయ్యారు. జపాన్ తీసుకొన్న నిర్ణయం కారణంగా దక్షిణ కొరియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని మూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్వైపాక్షికంగా ఈ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చేయాల్సిన కృషి చేస్తుందని చెప్పారు. దీనికి అనుగుణంగా జపాన్ స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మరింత సాగతీత ధోరణికి దారి తీయకూడదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. జపాన్ నిర్ణయం నేపథ్యంలో దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితి నెలకొందనీ.. ఈ నేపథ్యంలో ప్రైవేటు - ప్రభుత్వ రంగాల చొరవతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులకు మూన్ వివరించారు. జపాన్ నిర్ణయాలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని మూన్ స్పష్టం చేశారు.