అంతర్జాతీయం

పుస్తక ధరల నిర్ణాయక కమిటీలో భారత రచయిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 11: అంతర్జాతీయ పుస్తక ధరల నిర్ణాయక కమిటీలో 2020 సంవత్సరానికి భారత్‌కు చెందిన అవార్డు గ్రహీత, రచయిత జీత్ తాయిల్‌కు చోటు దక్కింది. ఐదుగురు సభ్యుల జడ్జింగ్ ప్యానల్‌లో ఒకరుగా ఆయన వ్యవహరిస్తారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘లిట్రసీ అవార్డ్ ఫర్ ట్రాన్స్‌లేటెడ్ ఫిక్షన్’ గురువారం నాడిక్కడ ప్రకటించింది. ‘నార్కోపోలిస్’ పుస్తక రచయిత తాయిల్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మే వరకు బ్రిటన్, ఐర్లాండ్‌లలోప్రచురించిన ఎంట్రీల నుంచి ఈ ఎంపిక జరిగింది. 59 ఏళ్ల తాయిర్ కేరళ వాస్తవ్యుడు. ముంబయి, బెంగళూరు, హాంగ్‌కాంగ్, న్యూయార్క్‌ల్లో 23 ఏళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన గాయకుడు కూడా. ‘దీస్ ఏరోస్ ఆర్ కరెక్ట్’ వంటి పలు పద్య సాహిత్యాలు ఆయనకు మంచి పేరును, పురస్కారాలను తీసుకువచ్చాయి. ఇలావుండగా లూసీ కాంపోస్, జన్నిఫర్ క్రాఫ్ట్, వలేరియా లూయిసెల్లీలతో కలిసి కమిటీలో తాయిల్ బాధ్యతలను నిర్వహిస్తారు.