అంతర్జాతీయం

‘గ్రీన్‌కార్డు బిల్లు’కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 11: అమెరికాలో శాశ్వ త నివాసం ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు వలసవాదులకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఒక దేశానికి గరిష్ఠంగా ఏడు శాతానికిమించి గ్రీన్ కార్డులు మంజూరు చేయకూడదన్న నిబంధనలు సడలిస్తూ బిల్లు రూపొందించారు.
బిల్లు వల్ల భారతీయ ఐటీ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు గ్రీన్‌కార్డు కోసం వేచి ఉన్నారు. అమెరికా ప్రభుత్వం ఇంతకు ముందు ఏడు శాతం గ్రీన్‌కార్డులే మంజూరు చేయాలన్న నిర్ణయం తీసుకోడంతో పెద్దదేశాలు ఆందోళన చెందాయి. ఇప్పుడా నిబంధన ఎత్తివేయడంతో భారత్ ఉద్యోగులకు మేలు జరుగనుంది. చిన్నాపెద్దా అన్న సంబంధం లేకుండా అన్ని దేశాలను ఒకే గాటన కట్టి ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమన్న అమెరికా నిబంధనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎందరో ప్రతిభావంతులు నష్టపోతున్నారని భారత్, చైనా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఏడుశాతం నిబంధన సడలిస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ‘ఫెయిర్‌నెస్ ఫర్ హైస్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్-2019’ లేదా ‘హెచ్‌ఆర్ 1044’కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది అని ఓ అధికారిక ప్రకటన చేశారు. 435 మంది సభ్యులున్న అమెరికా కాంగ్రెస్‌లో 365-45 ఓట్ల తేడాతో బిల్లు పాస్ అయింది. బిల్లు వల్ల ఉద్యోగ ఆధారిత వలసవాదులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ‘కాన్సాస్ సిటీ స్టార్’ స్పష్టం చేసింది.