అంతర్జాతీయం

గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్/ఇస్లామాబాద్ : ఆగివున్న ఓ సరుకుల రవాణా రైలును మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో 16 ప్రయాణికులు మృత్యువాత పడగా, 80 మంది క్షతగాత్రులయ్యారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు అందజేసిన సమాచారం మేరకు క్వెట్టా వైపుప్రయాణిస్తున్న అక్బర్ ఎక్స్‌ప్రెస్ పంజాబ్ ప్రావిన్స్ సాధికాబాద్ తెహసిల్‌లోని వల్హార్ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న స్టేషనరీ సరుకు తరలించే రైలును ఢీకొంది. ప్రమాద సమయంలో సరుకును తరలించే రైలు లూప్‌లైన్‌లో ఉంది. అతివేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు మెయిన్‌కు బదులుగా లూప్‌లైన్‌లోకి మళ్లిపోయింది. దీంతో రెండు రైళ్లూ ఢీకొన్నాయి. కాగా ప్రమాదానికి గురైన ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రయాణికులందరినీ దింపేసి మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి వెంటనే రైలుమార్గాన్ని క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని డిప్యూటీ కమిషనర్ రహీమ్ యార్ ఖాన్ తెలిపారు. రైలులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు పెద్దసంఖ్యలో సహాయక బృందాలను మోహరించామన్నారు. ఆహారపానీయాలను అందజేస్తున్నామని, సైనికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు. కాగా అక్బర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఇంజన్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే మూడు కంపార్ట్‌మెంట్లు కూడా దెబ్బతిన్నాయి. ఒక చిన్నారిని, మరో వ్యక్తిని ధ్వంసమైన రైలు బోగీల నుంచి రక్షించామని, ఐతే క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.