అంతర్జాతీయం

‘వత్తిళ్ల’ వల్లే నవాజ్‌కు శిక్ష వేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 12: కొన్ని అదృశ్య శక్తుల వత్తిడి కారణంగానే తాను పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ అవినీతి కేసులో ఏడేళ్ళ జైలు శిక్ష విధించానంటూ ఓ వీడియోలో వ్యాఖ్యానించినట్లుగా బయటపడిన అవినీతి నిరోధక కోర్టు న్యాయమూర్తిని పాకిస్థాన్ న్యాయ శాఖ తొలగించింది. హల్ అజీజియా స్టీల్‌మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్‌కు జైలు శిక్ష విధిస్తూ అకౌంటబులిటీ కోర్టు న్యాయమూర్తి హర్షద్ మాలిక్ గత ఏడాది డిసెంబర్ 26న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పాక్ ముస్లీంలీగ్ (నవాజ్) పార్టీకి చెందిన ఓ నాయకుడితో మాట్లాడుతున్న సందర్భంగా సదరు న్యాయమూర్తి ఈ విధంగా అన్నట్లుగా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ వీడియోను నవాజ్ షరీఫ్ కుమార్తె మారియం బహిర్గతం చేసింది. తనకు కొన్ని అదృశ్య శక్తుల నుంచి తీవ్ర స్థాయిలో వత్తిడి రావడం వల్లే నవాజ్ షరీఫ్‌కు జైలు శిక్ష వేసినట్లుగా ఆ న్యాయమూర్తి అనడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే ఈ వీడియోలోని అంశాలను ఆయన నిరాకరించారు. అవన్నీ బూటకాలనీ వాదిస్తూ శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అంశంపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఈ కేసులో దర్యాప్తు తేలేంత వరకూ అకౌంటబులిటీ కోర్టు న్యాయమూర్తి పదవి నుంచి హర్షద్ మాలిక్‌ను తప్పించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయ శాఖకు లేఖ రాశారు. హైకోర్టు ఆదేశం ప్రకారం హర్షద్ మాలిక్‌ను తొలిగించినట్లుగా పాక్ న్యాయ శాఖ మంత్రి ఫరూఖ్ నాసిం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అయితే ఏలాంటి వత్తిడి, బెదిరింపు లేకుండానే అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు తాను జైలు శిక్ష విధించినట్లుగా అర్షద్ మాలిక్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు హోం మంత్రి వివరించారు.