అంతర్జాతీయం

ప్రతిభకు రెడ్‌కార్పెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 12: గ్రీన్ కార్డులు మంజూరుపై ఆంక్షలు ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని అమెరికా కాంగ్రెస్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అమెరికా సీనియర్ ప్రజాప్రతినిధులు సైతం ట్రంప్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గ్రీన్‌కార్డుల దరఖాసుల్లో ఏడు శాతమే మంజూరు చేశాలన్న నిషేధం తొలగించడం వల్ల అమెరికాకు ప్రతిభావంతులు వస్తారని వారన్నారు. గ్రీన్‌కార్డుల మంజూరుపై ఉన్న ఏడుశాతం అన్న నిబంధనను అమెరికా కాంగ్రెస్ సవరించింది. బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఇది మంచి పరిణామంగా అమెరికా చట్టసభ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలో శాశ్వస నివాసం, అలాగే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వలసవాదులకు మంచి వార్తఅని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వారన్నారు.‘దేశంలో పరిశ్రమల్లో పోటీ తత్వం పెరుగుతుంది. తద్వారా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. నిపుణులు, ప్రతిభావంతులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సమర్థులైన ఉద్యోగులు వస్తారు’అని హౌస్ జుడీషియరీ సబ్ కమిటీ(ఇమ్మిగ్రేషన్-సిటిజన్‌షిప్) సభ్యుడు జోయే లోఫ్‌గ్రెన్ అన్నారు. అత్యంత సమర్థులైన వృత్తి నిపుణులు దొరుకుతారని వెల్లడించారు. గ్రీన్ కార్డు కోసం వేలాది మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, అలాంటి వారికి ఎలాంటి వివక్ష లేకుండా టాలెంట్ ఉన్నవారికి అవకాశం దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా అమెరికాలోనే పనిచేస్తూ శాశ్వత నివాసం ఏర్పరచుకోని వృత్తి నిపుణులకు బిల్లు ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి, వాణిజ్యరంగం వృద్ధికి ఇదెంతో దోహదం చేస్తుందని ఇండో-అమెరికన్ ఎంపీ రాజా కృష్ణమూర్తి అన్నారు. ఉద్యోగ ఆధారిత వీసాలు, కటుంబ సభ్యులు ఇక్కడ ఉండేందుకు వీలుకలుగుతుందని, అమెరికన్ కంపెనీలకు ప్రతిభావంతుల కొరత తీరుతుందని ఆయన తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జైపాల్ స్పష్టం చేశారు. భారతీయ ఐటీ నిపుణుల రొట్టెవిరిగి నేతిలో పడినట్టేనని, అవకాశాలు అందిపుచ్చుకుని వృత్తిలో మరింత రాణించేందుకు వీలుకలుగుతుందని అన్నారు. ఇంతకు మునుపువీసాల మంజూరులో ఆంక్షల వల్ల ఉద్యోగులు ముఖ్యంగా భారతీయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు అలాంటివి ఉండవని, అమెరికాలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కొత్త బిల్లు వీలుకల్పిస్తుందని జైపాల్ వెల్లడించారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతిభావంతులైన వృత్తి నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుందని జుడీషియరీ సబ్ కమిటీ (ఇమ్మిగ్రేషన్, సిటిజన్‌షిప్) ర్యాంకింగ్ మెంబర్ కెన్ అన్నారు. ఉద్యోగాల ఎంపిక కూడా పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘మా ఇమ్మిగ్రేషన్ పాలసీ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ముందు వచ్చిన వారికి ముందే అవకాశం ఉన్న పద్ధతిలో ఉంటుంది. ఫలానా దేశానికి ప్రాధాన్యత అన్నది తలెత్తదు.
ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బిల్లు ఓ వరం’అని కాంగ్రెస్ సభ్యుడు ఫ్రెంచ్ హిల్ అన్నారు.