అంతర్జాతీయం

ఎంపీల తీరుతో అసంతృప్తికి లోనయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రెగ్జిట్) ప్రక్రియ పూర్తికాకపోవడంపై బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి థెరిసా మే నిరాశా నిస్పృహలు వ్యక్తం చేశారు. బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా థెరిసా మే శుక్రవారం బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో బ్రెగ్జిట్‌పై ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలపకపోవడంతో పాటు సొం త క్యాబినెట్‌లోనే థెరిసా మే నాయకత్వాన్ని కొంతమంది వ్య తిరేకిస్తుండటంతో ఆమె మే నెల చివరలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరెమి హంట్, మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరి నాయకత్వ పోరు అంశం తేలకపోవడంతో థెరిసా మే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఎంపీలు బ్రెగ్జిట్‌కు అనుకూలం గా కొందరు, వ్యతిరేకంగా కొందరు విడిపోయి, ఎవరూ రాజీ కి ముందుకు రాకపోవడంతో బ్రెగ్జిట్ పార్లమెంటు ఆమోదం పొందడం లేదని, ఇది తనను నిరాశకు గురి చేస్తోందని థెరి సా మే తన టెలివిజన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘బ్రెగ్జిట్‌పై ఒక ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రయత్నంలో భాగంగా నేను నా పదవికి రాజీనామా చేశాను. పార్లమెంటు బ్రెగ్జిట్‌ను ఆమోదించేందుకు వీలుగా (ప్రతిపక్ష నాయకుడు) జెరెమి కోర్బిన్‌తో రాజీ పడటానికి నేను ప్రయత్నించాను’ అని పేర్కొన్నారు.