అంతర్జాతీయం

సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 13: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మోదీ తన పర్యటనలో భాగంగా హోస్టన్‌లో ఇండో-అమెరికన్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని అక్కడి భారత వర్గాలు తెలిపాయి. చికాగో, హోస్టన్ నగరాల్లో ఏదో ఒకటి మోదీ ప్రసంగానికి వేదిక కానున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతే మోదీ ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రధాని అమెరికా పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అమెరికాలోని భారత వర్గాలు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ హోస్టన్‌లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ 23న పర్యావరణ మార్పులపై నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారని పేర్కొంటున్నాయి. అయితే, ప్రధాని హోస్టన్ పర్యటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ సెప్టెంబర్ 22న భారతీయులతో జరిగే సమావేశంలో ఆయన ప్రసంగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అందు కు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలావుండగా, ప్రపంచంలోనే ఇంధన రాజధానిగా హోస్టన్‌కు గొప్ప పేరుంది. ఇంధన శక్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మోదీ సైతం ఇదే నగరాన్ని తన పర్యటనకు వేదికగా మలచుకునే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, మోదీ 2014లో తొలిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత అమెరికాలోని ఇండో-అమెరికన్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించడం ఇపుడు మూడోసారి కానుంది. ఇంతకుముందు మోదీ 2014లో న్యూయార్క్‌లోని మడిసన్ స్క్వేర్ గార్డెన్, 2016లో సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. మోదీ పాల్గొన్న ఈ రెండు సమావేశాలకు 20 వేల మందికి పైగా భారతీయులు హాజరయ్యారు.