అంతర్జాతీయం

ఫేస్‌బుక్‌పై 5 బిలియన్ డాలర్ల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 13: ఫేస్‌బుక్ తన సోషల్ నెట్‌వర్క్‌ల గోప్యతను కాపాడటంలో, డాటాను పరిరక్షించడంలో ఉల్లంఘనలకు పాల్పడినందున ఆ సంస్థపై విధించిన అయిదు బిలియన్ డాలర్ల జరిమానాను అమెరికా నియంత్రణ సంస్థ ఆమోదించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం ఈ విషయం వెల్లడించింది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) 3-2 ఓట్ల ఆధిక్యంతో ఈ జరిమానాకు ఆమోదం తెలిపిందని వాల్ స్ట్రీట్ జర్నల్ వివరించింది. ఎఫ్‌టీసీలోని ఇద్దరు డెమొక్రటిక్ పార్టీ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గోప్యతను ఉల్లంఘించినందుకు గాను ఎఫ్‌టీసీ ఇంత భారీ మొత్తంలో జరిమానాకు ఆమోదం తెలపడం ఇదే మొదటిసారి. అయితే, ఈ జరిమానా అమలు కావాలంటే అమెరికా న్యాయ శాఖ దీనికి తుది ఆమోదం తెలుపవలసి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.