అంతర్జాతీయం

వరదలను ముందే పసిగట్టొచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 16: ఎప్పుడు ఎక్కడ ఏ మేరకు వర్షాలు కురుస్తాయి?, వరదల ప్రభావం ఎలా ఉంటుంది? అని ముందుగానే అంచనా వేసే సరి కొత్త పరికరాన్ని అమెరికా శాస్తవ్రేత్తలు కనుక్కున్నారు. ఈ శాస్తవ్రేత్తల బృందంలో భారతీయ సంతతికి చెందిన శాస్తవ్రేత్త కూడా ఉన్నారు. అమెరికా, న్యూయార్క్‌లోని సిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు నాస్సెర్ నజ్బీ, నరేష్ దేవినేని దీనిని కనుక్కున్నారు. ప్రకృతి విలయతాండవం చేస్తే, దానిని అడ్డుకోవడం ఎవరితరం కాదు. అయితే వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసి చెబుతున్నందున, కొంత వరకు ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి ఆదుకోవడం జరుగుతున్నది. కాగా ఇప్పుడు అమెరికా శాస్తవ్రేత్తల బృందం మరో అడుగు ముందుకేసింది. భారీ వర్షాలు, వరదలపై ఖచ్చితమైన అంచనా వేసే అత్యాధునికమైన పరికరాన్ని కనుక్కున్నారు. ముందుగా వర్షాలు, వరదల గురించి అంచనా వేయడం ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించ వచ్చని, భారీగా నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని శాస్తవ్రేత్తలు తెలిపారు. పెద్ద చెరువులకు గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వారు చెప్పారు. డ్యాంలు, వంతెనలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కాపాడుకోవచ్చని తెలిపారు.