అంతర్జాతీయం

స్మగ్లింగ్‌ను పూర్తిగా అడ్డుకోలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగ్‌పూర్ (బంగ్లాదేశ్), జూలై 16: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సీమాంతర స్మగ్లింగ్‌ను పూర్తిగా అడ్డుకోజాలమని బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతాబలగం బోర్డర్ గ్వార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) పేర్కొంది. ఈ స్మగ్లింగ్‌ను నిరోధించడానికి భారత సరిహద్దు భద్రతాబలగం (బీఎస్‌ఎఫ్) మరింతగా సహకరించాలని కోరింది. భారత్- బంగ్లాదేశ్ మధ్య పశువులు, మాదకద్రవ్యాలు, తోలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్మగ్లింగ్ ఇరు దేశాల సరిహద్దు భద్రతా బలగాలకు ప్రధాన సవాలుగా నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జూలై 11వ తేదీన బంగ్లాదేశ్‌కు చెందిన పశువుల స్మగ్లర్లు జరిపిన బాంబు దాడిలో ఒక బీఎస్‌ఎఫ్ జవాను ఒక చేతిని కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. భారత్‌కు చెందిన పశువుల స్మగ్లర్లు ఒకసారి సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన అనంతరం వారిని వ్యాపారులుగా పరిగణించడం జరుగుతోందని ఒక అధికారి తెలిపారు. వారు ఒక్కో పశువుకు 500 టాకాల చొప్పున సంబంధిత అధికారులకు చెల్లించవలసిన అవసరం ఉంటుందని, తరువాత వారు ఎవరికి విక్రయించాలని అనుకుంటే వారికి ఆ పశువులను విక్రయించుకోవచ్చని ఆయన వివరించారు.