అంతర్జాతీయం

కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై నేడు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది హాగ్, జూలై 16: పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరి శిక్ష విధించిన భారత నేవీ రిటైర్డ్ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) బుధవారంనాడు తీర్పును వెలువరించనుంది. కుల్‌భూషణ్ జాదవ్ విడుదల కోసం భారత్ సమర్పించిన సమగ్ర సమాచారం ఆధారంగా ఐసీజే తన తీర్పును ప్రకటించనుంది. 49 ఏళ్ల జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రాంతంలో 2016 మార్చి 3న పాక్ సైన్యం పట్టుకుంది. ‘గూఢచర్య, తీవ్రవాదం’ కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ మిలటరీ కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించింది. అయితే, కోర్టు తీర్పును భారత్ సవాల్ చేయడంతో ఉరిశిక్షను ఎత్తివేసింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు (్భరత కాలమానం ప్రకారం సాయంత్రం ఆరున్నర గంటలు) ఐసీజేలోని సీనియర్ జడ్జి అబ్దుల్‌క్వావి అహమ్మద్ యూసుఫ్ తన తీర్పును ప్రకటించనున్నారని ఐసీజే ఈనెల ప్రథమార్థంలో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, పాకిస్తాన్ విదేశీ కార్యాలయం (ఎఫ్‌ఓ) అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ గత వారం మాట్లాడుతూ ‘జాదవ్’ కేసులో ఐసీజే తీసుకున్న నిర్ణయంపై తమ దేశం ఎలాంటి ‘పక్షపాతం’ వహించదని స్పష్టం చేశారు. ‘కోర్టు తీర్పుపై మేం పక్షపాతం వహించబోం’ అని ఆయన పేర్కొన్నారు. కోర్టుకు తమ వద్దనున్న ఆధారాలు చూపించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో 40 సీఆర్‌పీఎఫ్ జవాన్లను పాక్ ప్రేరేపిత జైషే అహమ్మద్ ఉగ్రవాద సంస్థ హతమార్చినందుకు ప్రతీకారంగా బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరపడంతో ఇరు దేశాల మధ్య ఉద్త్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నాలుగురోజులపాటు ఇక్కడ జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చింది. కుల్‌భూషణ్ జాదవ్ కేసును భారత్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తున్న విషయం తెలిసిందే. జాదవ్ విషయంలో పాక్ మిలటరీ కోర్టు అనుసరించిన తీర్పుపై యూఎన్ కోర్టు జోక్యం చేసుకోవాలని ఆయన కోరిన విషయం తెలిసిందే.