అంతర్జాతీయం

33 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 18: హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరిగే జపాన్‌లో ఒక దహనకాండ 33 మందిని బలిగొంది. క్యోటో నగరంలో గల ఒక యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలో ఎగిసిన మంటలు డజన్ల కొద్ది మందిని క్షతగాత్రులను చేశాయి. ఒక వ్యక్తి మూడంతస్తులు గల ఈ భవనంపై మండే స్వభావం గల ద్రవపదార్థాన్ని పోసి, నిప్పంటించినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి ఈ దహనకాండకు ఎందుకు పాల్పడ్డాడనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. ఇది ఒకవేళ దహనకాండ దాడియే అయితే, జపాన్‌లో కొన్ని దశాబ్దాలలో జరిగిన భయంకరమయిన నేరపూరిత చర్యగా నిలిచిపోతుంది.
ఈ సంఘటన వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యానిమేషన్ ఇండస్ట్రీ, అభిమానుల నుంచి బాధితులకు మద్దతు వెల్లువలా వచ్చింది. బాధితులను ఆదుకోవడానికి అనేక చోట్ల నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభమయింది. ఈ ఘటనలో 33 మంది చనిపోయారని స్థానిక అగ్నిమాపక శాఖకు చెందిన ఒక అధికారి గురువారం సాయంత్రం తెలిపారు. 36 మంది గాయపడగా, వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంటలు ఎగిసి పడుతున్న సమయంలో భవనంలో ఉన్న మొత్తం మంది ఎందరనేది లెక్కిస్తున్నట్టు ఆయన చెప్పారు. గురువారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఎమర్జెన్సీ కాల్స్ రావడంతో హుటాహుటిన తరలివచ్చామని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు.
జపాన్ ప్రధానమంత్రి షింజో అబే సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఈ సంఘటనపై స్పందించారు. ‘ఇదో భయంకరమయిన ఘటన. దీనిపై మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
సంఘటనకు కారణంపై తాము దర్యాప్తు జరుపుతున్నప్పటికీ, దీనిని దహనకాండ దాడిగానే అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘ఒక వ్యక్తి మండే స్వభావం గల ద్రవపదార్థాన్ని పోసి, నిప్పంటించాడు’ అని క్యోటో పోలీసు శాఖ అధికార ప్రతినిధి ఒక వార్తాసంస్థకు చెప్పారు.