అంతర్జాతీయం

ఉగ్రవాద సమస్యే ప్రధాన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చే వారం భేటీ అయినప్పుడు ఉగ్రవాద సమస్యే ప్రధాన అజెండా కానుంది. అంతేగాక, తాలిబన్ అంశం కూడా చర్చకు వస్తుందని వాషింగ్టన్ వర్గాలు అంటున్నాయి. తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థలను ఉక్కుపాదంతో అణచివేయాలని, తిరుగులేని కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసే అవకాశం ఉంది. 2015 అక్టోబర్‌లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆతర్వాత అమెరికా అధ్యక్షుడిగా పాక్ ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటిసారి. వైట్ హౌస్ ఆహ్వానంపై ఇమ్రాన్ సోమవారం అమెరికా వెళనున్నాడు. అక్కడ ఆయనకు సంప్రదాయబద్ధమైన స్వాగతం లభించనుంది. అనంతరం ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో ముఖాముఖి భేటీ ఉంటుంది. అనంతరం ఇమ్రాన్ విందుకు హాజరవుతారు. అందులో అమెరికా పాలక మండలి సభ్యులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఇమ్రాన్‌ను కలుస్తారు. ఇలావుంటే, ఇమ్రాన్ పర్యటన నేపథ్యంలో, పాకిస్తాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉందనే వార్తలను వైట్ హౌస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తోసిపుచ్చారు. అలాంటి అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై స్పష్టమైన విధానాన్ని అమలు పరచి, దానిని కూకటివేళ్లతో పెకళించడానికి పకడ్బందీ చర్చలు తీసుకున్న తర్వాత ఆంక్షల సడలింపు అంశాన్ని అమెరికా పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఏ మాత్రం రాజీలేని పోరాటం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఏడాది జనవరిలో పాకిస్తాన్‌కు భద్రతాపరమైన సహాయసహకారాలను అమెరికా ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ విధానంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. పాకిస్తాన్ కేంద్రంలో ఎన్నో ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించడం అమెరికా చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఎన్ని పర్యాయాలు హెచ్చరించినప్పటికీ, ఉగ్రవాదం అణచివేతకు పాక్ సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో ఆంక్షలను విధించింది. వీటిని కొనసాగిస్తామని, ఉగ్రవాద నిర్మూలకు పాక్ చర్యలు తీసుకుంటున్నదన్న నమ్మకం ఏర్పడిన తర్వాతే ఉపసంహరణ జరుగుతుందని వైట్ హౌస్ అధికారి వివరించారు. అఫ్గానిస్తాన్‌లో శాంతి కోసం తాలిబన్లతో చర్చలు జరిపేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాల్సిందిగా పాక్‌ను అమెరికా కోరనుంది. పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పూర్తి స్థాయిలో మళ్లీ కొనసాగించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నది. అయితే, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పాక్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందా? లేదా? అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. తాలిబన్లతో అమెరికా ప్రతినిధులు త్వరలోనే శాంతి చర్చలు జరపనున్న నేపథ్యంలో, పాక్ ఎలాంటి పాత్రను పోషిస్తుందనేదని ఆసక్తి రేపుతున్నది.