అంతర్జాతీయం

పాక్ ఆత్మాహుతి దాడిలో 9మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్ : పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయి తుపాకులతో కాల్పులు జరపడం, ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు పోలీసులు ఉన్నారు. ఈ ఘాతుకానికి తామే పాల్పడ్డామని తెహరిక్-ఏ-తాలిబన్ (టీటీపీ) ప్రకటించింది. ఎక్కువ మంది ప్రాణాలు బలిగొని శాంతి-్భద్రతలకు విఘాతం కల్పించాలన్నది టీటీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
అందుకే చాలా వ్యూహాత్మకంగా కదిలింది. ఈ ఘటన ఆదివారం డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని కోట్ల సైదన్ చెక్ పోస్టు వద్ద జరిగింది. జిల్లాలోని ఖైబర్ ఫకుతున్‌ఖ్వాలో శనివారం ఇటీవల విలీనం చేసిన గిరిజన ప్రాంతాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు, పోలీసులూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆదివారం వదయం సైదన్ చెక్ పోస్టు వద్దకు రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు ముష్కరులు తుపాకులతో వచ్చి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో పోలీసులు అక్కడికక్కడే మరణించారు. ఘటన జరగడంతో జనం గుమిగూడి అంబులెన్స్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకునే సరికి జనం ఇంకా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో అప్పటికే అక్కడ బురఖా ధరించి కూర్చొని ఉన్న ఓ మహిళ జనం మధ్యకు రెప్పపాటులో దూసుకుని వచ్చి బాంబు పేల్చుకోవడంతో భారీ శబ్ధంతో జనం కకావికలమయ్యారు. ఈ ఘటనతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. తుపాకుల కాల్పులతో ఇద్దరు, ఆత్మాహుతి దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. బురఖా ధరించిన మహిళ ముందు నుంచే అక్కడ కూర్చొని ఉన్నారని స్థానికుల కథనం. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ సుమారు 7 నుంచి 8 కిలోల బరువైన బాంబు కట్టుకుని ఉంటుందని పోలీసుల అంఛనా. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ శరీరం గుర్తు పట్టలేనంతగా ముక్కలైంది. ఇలాఉండగా ఆమె తల వెంట్రుకలను, శరీర భాగాలను, విస్పోటానికి ఉపయోగించిన పదార్థాలను సేకరించి ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనతో పాక్ ప్రజలు తల్లడిల్లారు. ప్రభుత్వం అప్రమత్తమైంది.
మేమే చేశాం: తాలిబన్
ఇలాఉండగా దుర్ఘటన జరిగిన కొద్ది సేపటికే తెహరీక్-ఏ-తాలిబన్ ఈ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.