అంతర్జాతీయం

తీరుమారని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 22: కాశ్మీర్ అంశాన్ని మరోసారి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. వెనిజులాలో జరిగిన అలీన దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తడం పట్ల తీవ్ర స్వరంతో మండిపడింది. ఓ దేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయడానికి అంతర్జాతీయ సంస్థలు ఎంత మాత్రం వేదిక కాకూడదని విస్పష్టంగా తెలియజేసింది. అలీన దేశాల కూటమి అనేది అంతర్జాతీయ సహకారానికి కొలమానం కావాలే తప్ప ఒక దేశం మరో దేశంపై దుమ్మెత్తిపోసుకోవడం ఆలంబన కాకూడదని, అలాగే ద్వైపాక్షిక అంశాలను ఆసరగా చేసుకుని ఆయా దేశాలు తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కడానికి ఇది వేదిక కాదని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. వెనుజులా రాజధాని కరాక్కస్‌లో జరిగిన మంత్రిత్వ స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన ‘వ్యక్తిగత ద్వేషాలు ఇతర దేశాలపై విమర్శలు గుప్పించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి, ముఖ్యంగా ఇలాంటి అంశాలు అలీన దేశాల కూటమి వంటి అంతర్జాతీయ సంస్థల అజెండా ఎంత మాత్రం కాదు..’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే పాక్ చేసిన ఈ ప్రయత్నానికి ఇతర సభ్య దేశాల నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొన్న ఆయన కాశ్మీర్ అంశాన్ని ‘నామ్’ వేదికపై పాక్ ప్రస్తావించడం తమ సొంత వాదనకు బలాన్ని చేకూర్చుకునే ప్రయత్నమేనని అక్బర్ దుయ్యబట్టారు. పాక్ పేరు ప్రస్తావించకుండానే ఆ దేశ ధోరణిపై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.