అంతర్జాతీయం

మోదీ.. ఇంకా ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, ఆగస్టు 6: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రత్యేకించి హూస్టన్ నగరంలో ఉన్న భారత సంతతి ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెప్టెంబర్ 22వ తేదీన ఘన స్వాగతం పలకడానికి ఎంతో ఉత్సుకతతో వేచిచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగం వినడానికి సుమారు 50వేల మంది మద్దతుదారులు హాజరవుతారని భావిస్తున్నారు. ‘హౌడీ, మోదీ’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అమెరికాలోని ఇండో-అమెరికన్‌లు అందిస్తున్న మహత్తరమయిన సేవలు, భారత్, అమెరికా మధ్య గల పటిష్ట, శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే రీతిలో ‘షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. అమెరికాలోని భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో హూస్టన్ ఒకటి. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో అయిదు లక్షల మందికి పైగా భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ప్రపంచ ఇంధన కేంద్రంగా పేరొందిన హూస్టన్‌లోని ప్రఖ్యాతి గాంచిన ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో నిర్వహించే ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి 50వేల మంది మద్దతుదారులు హాజరవుతారని నిర్వాహకుల అంచనా. రిజిస్ట్రేషన్లు మొదలయిన మొదటి వారంలోనే వెయ్యి మంది వలంటీర్లతో పాటు 25వేల మంది హాజరుకావడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారని ‘హౌడీ, మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టెక్సాస్ ఇండియా ఫోరం వెల్లడించింది. ఈ కార్యక్రమం కోసం 650 స్వాగత భాగస్వామ్య సంస్థలు ఇప్పటికే సంతకాలు చేశాయని వివరించింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సహాయ పడేందుకు భిన్న రంగాలకు చెందిన అనేక మంది వలంటీర్లు పనిచేయడానికి ముందుకు వస్తున్నారని, దీనిని బట్టి ఈ కార్యక్రమం కోసం భారత సంతతి ప్రజలు ఎంత ఉత్సుకతతో వేచి చూస్తున్నారో అర్థమవుతోందని ‘హౌడీ, మోదీ’ ఈవెంట్ కన్వీనర్ జుగల్ మలాని అన్నారు.