అంతర్జాతీయం

అక్కసుతో రగులుతున్న పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌పై దాడికి ఐదెంచల వ్యూహం రాయబారి బహిష్కరణ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు రద్దు
ఐరాసను ఆశ్రయంచాలని నిర్ణయం 14న సంఘీభావ దినోత్సవం
న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత ప్రభుత్వం కాశ్మీర్ విభజన బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ అక్కసుతో రగిలిపోతూ ఎదురుదాడికి దిగింది. తమ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. పంచ సూత్రాల వ్యూహాన్ని ఖరారు చేసింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం తమ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను బహిష్కరిస్తున్నట్టు పాక్ వెల్లడించింది. భారత్‌లో పాక్ రాయబారి మొయిన్ ఉల్ హక్‌ను స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ-కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత్ ఏకపక్షంగా ధోరణులతో ముందుకు వెళ్తోందని పాక్ మండిపడింది. అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. ఐక్యరాజ్య సమితి కూడా వెంటనే స్పందించి కాశ్మీర్‌పై భారత్ దూకుడును అడ్డుకోవాలని కోరింది. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలను తగ్గించుకోవడం, ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రద్దు చేయడం, ద్వైపాక్షిక ఏర్పాట్లను పునఃసమీక్షించడం, ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లడం, కాశ్మీరీల సాహసోపేతమైన ఐక్యతను నిదర్శనంగా ఈ నెల 14వ తేదీన సంఘీభావ దినోత్సవంగా నిర్వహించడం వంటి ఐదు వ్యూహాలను ఖరారు చేసినట్టు పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని ఇమ్రాన్‌తో సమావేశమైన పౌర, మిలటరీ ఉన్నతాధికారులంతా ఈ ఐదు సూత్రాల వ్యూహానికి ఏకగ్రీవంగా స్పందించారని పేర్కొంది. పాక్ ఆక్రమిత ప్రాంతం సహా కాశ్మీర్‌లో మొత్తం భారత్ అంతర్భాగమేనని హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ యుద్ధప్రాతిపదిక మీద స్పందించాల్సి వచ్చింది. జాతీయ భద్రతా కమిటీని సమావేశపరచి తక్షణం అనుసరించాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్‌ను బహిష్కరించారు.