అంతర్జాతీయం

కాబుల్‌లో తాలిబన్ల హింసాకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబుల్, ఆగస్టు 7: అఫ్గనిస్తాన్‌లోని కాబుల్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జనాలు అధికంగా ఉన్న ప్రాంతంలో శక్తివంతమైన బాంబును పేల్చడంతో 10 మంది పౌరులు, నలుగురు పోలీసులు మరణించారని, ఇంకా 145 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. బాంబు పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, చాలా దూరం వరకూ దట్టమైన నల్లటి పొగ కనిపించిందని పోలీసులు తెలిపారు.
శక్తివంతమైన బాంబును కారులో అమర్చి పేల్చినట్లు పోలీసుల ప్రాథమిక అంఛనా. ట్రక్కులో బాంబు తీసుకుని వచ్చి పేల్చారని, పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని నివాసాల గోడలు, పైకప్పులు బీటలు వారాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. బాంబు పేలుడుతో దట్టమైన నల్లటి పొగ ఆవరించిందని, అదంతా తొలిగిన తర్వాత తీవ్రంగా గాయపడిన 145 మందిని సమీపంలోని అసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్దుల అర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అత్యంత హృదయవిదారకంగా మారిందని స్థానిక జర్నలిస్టు జకీరియా హసాని పేర్కొన్నారు. అనేక మంది తమ వారి కోసం వెతుక్కుంటూ హాహాకారాలతో పరుగులు తీశారని జకీరియా పేర్కొన్నారు. పేలుడు శబ్ధానికి తల ముక్కలైనంత పనైందని స్థానిక దుకాణందారు అహ్మద్ సలెహ తెలిపారు. కిటికీల అద్దాలు పగిలి గాలిలో ఎగిరాయని, కిలో మీటరు వరకూ పేలుడు ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. ఈ వారంలో యూఎస్, తాలిబన్లు దోహలో ఎనిమిదో రౌండ్ జరిపిన శాంతి చర్చలు అద్భుతమైన పురోగతి సాధించాయని అందరూ భావించారు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని అంటున్నారు.
సెప్టెంబర్ 28న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాలని అఫ్గన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు ప్రజలతో సమావేశాలు నిర్వహించరాదని తాలిబన్లు తాజాగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాఉండగా మంగళవారం కాబుల్‌లో తాలిబన్లు బాంబు పేల్చిన ఘటనలో ఐదుగురు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్టట్లు అంతరంగిక మంత్రిత్వ శాఖ తెలిపింది.