అంతర్జాతీయం

హవాయ్ అగ్ని పర్వత బిలంలో నీటి నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హొనోలులూ (పశ్చిమాసియా), ఆగస్టు 7: హవాయ్‌కి సమీపంలోని కిలాయియాలో ఉన్న అగ్ని పర్వత బిలంలో నీటి నిల్వలను శాస్తవ్రేత్తలు కనుగొన్నారు.
ఆ నీరు అత్యంత వేడిగా ఉందని ఈ పరిశోధనలు నిర్వహించిన అమెరికాకు చెందిన భూగర్భ శాస్తవ్రేత్తలు తెలిపారు. వారాంతంలో రికార్డు చేసిన ఉష్ణోగ్రతలనుబట్టి ఆ బిలంలో నీటి నిల్వ, వేడిమి క్రమంగా పెరుగుతున్నట్టు తేలిందన్నారు. గతంలో కిలాయియా శిఖరాగ్ర సదస్సు జరిగిన ఈ ప్రాంతమంతా ప్రస్తుతం ఓ శిలాద్రవ (లావా) సరస్సులా మారింది. అక్కడ 158 డిగ్రీల ఫారన్‌హీట్ (70 డిగ్రీల సెల్సియస్) వేడిమి ఆవహించి ఉందని శాస్తవ్రేత్తలు వెల్లడించారు.
అక్కడి ఓ కుంట నుంచి వేడినీటి ఊటలు ఉద్భవిస్తున్నాయని కనుగొన్నట్టు తెలిపారు. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అగ్నిపర్వత బిలంలో నీటి నిల్వలను గతవారం జరిపిన పరిశోధనల సందర్భంగా కనుగొన్నామని, ఆ తర్వాత వరుసగా నిర్వహించిన పరిశోధనల్లో మరో రెండు నీటి కుంటలను కూడా కనుగొన్నామని ఆ శాస్తవ్రేత్తలు తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారిగా కిలాయియా పర్వత విస్పోటనం నిలిచిపోయింది.
దీంతో గత వేసవిలో ఈ అగ్నిపర్వత బిలం తాలూకు గోడలు కూలిపోవడంతోబాటు, లావా సరస్సు సైతం అదృశ్యమైంది. కొన్ని సందర్భాల్లో భూగర్భంలో శిలాద్రవంతో నీరు సమ్మిళితమై పర్వత విస్పోటనాన్ని ఆపుతాయని శాస్తవ్రేత్తలు ఈ సందర్భంగా వెల్లడించారు.