అంతర్జాతీయం

17న భూటాన్ రాజుతో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న భూటాన్ రాజుతో భేటీ కానున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. భూటాన్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి అధికారులతో ఈ నెల 17న భూటాన్‌కు చేరుకుంటారు. అదే రోజున భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ నమ్‌గ్యెల్ వాంగ్‌చుక్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టవంతం చేయడంతో పాటు ఇరు దేశాల సంయుక్త సహకారంతో జల విద్యుత్తు రంగంపై చర్చించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మంగ్దేచ్చు హైడ్రోపవర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖ్లే శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు.
భూటాన్ అభివృద్ధి కోసం 5 వేల కోట్ల రూపాయల సహాయాన్ని 12వ పంచవర్ష ప్రణాళికలో ఇస్తామని గత ఏడాది డిసెంబర్‌లో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు తొలి విడత సహాయాన్ని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ భూటాన్‌లోని రాయల్ యూనివర్సిటీ విద్యార్థులనుద్ధేశించి ప్రసంగిస్తారని గోఖ్లే తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి మర్యాదపూర్వకంగా భూటాన్ రాజు, రాణి మధ్యాహ్నం విందు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.