అంతర్జాతీయం

పాక్‌కు రష్యా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: జమ్మూకాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల సానుభూతి పొందాలన్న పాకిస్తాన్ ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. పాక్‌కు తాజాగా రష్యా షాక్ ఇచ్చింది. ‘ఆర్టికల్ 370 రద్దు. జమ్మూకాశ్మీర్ పునర్విభజనం రాజ్యాంగబద్ధంగానే జరిగాయి. ఈ విషయంలో భారత్ తీరును మేం సమర్ధిస్తాం’అని రష్యా ప్రకటించింది. సిమ్లా ఒప్పందానికి అనుగుణంగానే రాజకీయ, ద్వైపాక్షిక సమస్యలు పరిష్కారమవుతాయని రష్యా పేర్కొంది. జమ్మూకాశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. ఉద్రిక్తలు తలెత్తకుండా ఇరుదేశాలు సంయమనం పాటిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేసింది. జమ్మూకాశ్మీర్‌పై అడిగిన ఓ ప్రశ్నకు రష్యా విదేశాంగ శాఖ స్పందించింది.
‘కాశ్మీర్‌లో మార్పులు భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయి’అని వెల్లడించింది. 1972నాటి సిమ్లా ఒప్పందం, 1999నాటి లాహోర్ ప్రకటనకు అనుగుణంగానే రాజకీయ, దైపాక్షిక ససమస్యలు పరిష్కారమవుతాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.