అంతర్జాతీయం

కలిసొచ్చిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 10: కేరళకు చెందిన ఓ 43 ఏళ్ళ డ్రైవర్‌ను దుబాయ్‌లో అదృష్టం వరించింది. దురదృష్టవంతున్ని ఎవరూ బాగు చేయలేరు, అదృష్టవంతున్ని ఎవరూ చెరపలేరు అన్న చందంగా అబ్దుల్ సలాం షానవాజ్‌పై ఏకంగా 272.260 డాలర్ల వర్షం కురిసింది. ఇక వివరాల్లోకి వెళితే కేరళ, తిరువనంతపురం ప్రాంతానికి చెందిన షా నవాజ్‌కు కుటుంబాన్ని పోషించడం భారం కావడంతో, నాలుగు రాళ్ళు సంపాదించుకుని రావాలన్న పట్టుదలతో 1997 సంవత్సరంలో దుబాయ్‌కు చేరుకున్నాడు. వెళ్ళేప్పుడు తన డ్రైవింగ్ లైసెన్స్ తప్ప మరేమీ వెంట తీసుకెళ్ళలేదు. ఎంతో కష్టపడినా వచ్చిన డబ్బులు తన జీవనానికి సరిపోతున్నాయే తప్ప కుటుంబానికి పంపించడం సాధ్యం కావడం లేదు. దీంతో చాలా మనోవేదనకు గురయ్యేవాడు. ఇంతలో అనుకోకుండా ఓ రోజు దుబాయ్‌లోని అబుదాబిలో గల ఓ ప్రముఖ మాల్ నిర్వహించిన ‘మాల్ మిలినియర్’ పోటీలో పాల్గొనడంతో, అదృష్టం ఆయన్ను తన్నుకుంటూ వచ్చేసింది. ఏకంగా 272.260 డాలర్లు గెలుపొందాడు. పోటీలో పాల్గొనేందుకు ఆయన ఖర్చు చేసింది. కేవలం 54 డాలర్లు మాత్రమే. ఈ డబ్బులతో ఇల్లు కట్టుకుని, కుటుంబాన్ని పోషించుకుంటానని షానవాజ్ సంతోషంగా చెప్పాడు. ఇక్కడ ఇంకో 50 ఏళ్ళు ఆటో నడిపించినా, ఇంత మొత్తంలో సంపాదించే వాడిని కాదని ఆయన తెలిపారు. కేరళలోని తన భార్యకు ఫోన్‌లో చెప్పానని, ఆమె కూడా నమ్మలేని నిజంగా, ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారని ఆయన అన్నారు.