అంతర్జాతీయం

కాశ్మీర్‌పై కలిసిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 12: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి సోమవారం పిలుపునిచ్చారు. కాశ్మీర్ పరిణామాలపై రాజకీయ విభేదాలకు అతీతంగా బలమైన వాదనను వినిపించాల్సిన అవసరం ఉందని ముజాఫరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఈ ప్రాంతంలో జరిగిన ఈద్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కాశ్మీర్‌పై యావత్ పాకిస్తాన్, అలాగే దాని నాయకత్వం సమైక్యంగా ముందుకు వెళుతోందని, ఈ నెల 14న ఉమ్మడి గళాన్ని చాలా బలంగా వినిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీరీలకు పాకిస్తాన్ పూర్తి మద్దతు అందిస్తుందని.. 14వ తేదీన కాశ్మీర్ సంఘీభావ దినోత్సవంగా పాటిస్తామని తెలిపారు. అలాగే 370 అధికరణ రద్దు చేసినందుకు ఈ 15వ తేదీన బ్లాక్ డేగా పాటిస్తామని కురేషి తెలిపారు. కాశ్మీర్ అంశంపై భిన్న స్వరాలు వినిపించడం వల్ల అంతిమ లక్ష్యమే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని.. అందుకే రాజకీయ పార్టీలన్నీ విభేదాలకు అతీతంగా వ్యవహరించాల్సిన తరుణం ఇదేనని ఆయన తెలిపారు. ఏకపక్షంగా ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడం వల్ల దాన్ని వ్యతిరేకించడం తప్ప కాశ్మీర్ ప్రజలకు మరో అవకాశం లేకుండా పోయిందని ఖురేషి తెలిపారు. గిల్జిత్-బాల్టిస్తాన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన ఓ ప్రశ్నకు జవాబిచ్చిన ఖురేషి.. ‘ఈ హోదాను ఇవ్వ డం వల్ల కాశ్మీర్ లక్ష్యం దెబ్బతింటుంది.. అలాగే పాకిస్తాన్ వైఖరి కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది.. అయినా కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించాం’ అని ఆయన తెలిపారు.