అంతర్జాతీయం

మానవ హక్కులను, శాంతిని పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 16: ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగింపుపై రహస్య చర్చలు జరుపనున్నందున భారత్, పాకిస్తాన్‌లు మానవ హక్కులను పరిరక్షించాలని, ఆ ప్రాంతంలో శాంతిని పెంపొందించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు షీలా జాక్సన్ లీ కోరారు. కాశ్మీర్ అంశంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ పాకిస్తాన్ ఇప్పటికే భద్రతా మండలి అధ్యక్షుడికి ఒక లేఖ రాసింది. ‘ఐరాస భద్రతా మండలి సమావేశం కానున్న తరుణంలో భారత్, పాకిస్తాన్‌లకు శాంతిని, మానవ హక్కులను పరిరక్షించే అవకాశం ఉంది’ అని షీలా జాక్సన్ లీ గురువారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.
‘అణ్వస్త్రాలు కలిగి ఉన్న ఇరు దేశాలు మానవ హక్కులను పరిరక్షించడానికి, శాంతిని పెంపొందించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆ ప్రాంతం గురించి తెలిసిన వ్యక్తిగా నేను కోరుతున్నాను’ అని పాకిస్తానీ కాంగ్రెసనల్ కాకస్ కోచైర్‌వుమన్, ఇండియా కాకస్ సభ్యురాలు కూడా అయిన లీ పేర్కొన్నారు. గురువారం హూస్టన్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లీ పాల్గొన్నారు.
‘మహాత్మా గాంధీ, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్‌ల స్ఫూర్తితో మేము భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం’ అని ఆమె తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.