అంతర్జాతీయం

మైత్రీ బంధం కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థింపూ, ఆగస్టు 17: ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త రీతిలో ముందుకు తీసుకెళ్లాలని భారత్, భూటాన్‌లు నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శనివారం పలు కీలక అంశాలపై పది ఒప్పందాలు కుదిరాయి. భూటాన్ ప్రధాని లోటే షేరింగ్‌తో నరేంద్ర మోదీ అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. తాజాగా కుదిరిన పది ఎంఓయూల వల్ల రెండు దేశాల మైత్రీ బంధం కొత్త శక్తిని సంతరించుకుంటుందని ఇరువురు నేతలు పేర్కొన్నారు. భారత్-్భటాన్ సంబంధాలను మరింతగా మెరుగు పరుచుకునేందుకు ఎంతో అవకాశం ఉందని, ముఖ్యంగా ఆర్థిక, సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎంతో అవకాశం ఉందని మోదీ తెలిపారు. భారత్‌లో రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ భూటాన్‌కు రావడం ఇదే మొదటిసారి. మొదటిసారి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఆయన సందర్శించిన విషయం తెలిసిందే. తాజా పర్యటన సందర్భంగా మాంగ్ దే చూ జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ భారత్-్భటాన్ ఐదు దశాబ్దాల మైత్రీ బంధానికి సంకేతంగా ఓ సంస్మరణ తపాలా బిల్లను ఆవిష్కరించారు. రెండోసారి భారత్ ప్రధానిగా బాధ్యలు చేపట్టిన తొలినాళ్లలోనే భూటాన్‌ను సందర్శించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని సంయుక్త మీడియా ప్రకటనలో మోదీ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. అంతరిక్ష పరిశోధన, పౌర విమానయానం, సమాచార టెక్నాలజీ, విద్యుత్, విద్య తదితర రంగాల్లో ఇరుదేశాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ పర్యటన సందర్భంగా మోదీ రూపే కార్డు కూడా భూటాన్‌లో ఆవిష్కరించారు. దీంతోనే సిమ్‌టోకా జాంగ్‌లో కొన్ని వస్తువులు కొన్నారు. 1628లో నిర్మితమైన ఈ కేంద్రం భూటాన్ పరిపాలనా కేంద్రంగా కూడా పనిచేస్తోంది. రూపే కార్డు వల్ల భారత్-్భటాన్‌ల మధ్య డిజిటల్ చెల్లింపుల సంబంధాలు కూడా మెరుగవుతాయన్న ఆకాంక్షను మోదీ వ్యక్తం చేశారు. వాణిజ్యం, టూరిజం కూడా దీంతో మరింత విస్తరిస్తుందన్నారు. ఉమ్మడి ఆధ్యాత్మి వారసత్వం, ప్రజా సంబంధాలు ఇరుదేశాల సాన్నిహిత్యాన్ని ఎంతగానో పెంపొందించాయని మోదీ తెలిపారు. భూటాన్ అభివృద్ధిలో భారత్ ప్రధాన భాగస్వామిగా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ దేశ పంచవర్ష ప్రణాళికలకు మద్దతును కొనసాగిస్తామని మోదీ తెలిపారు. భూటాన్‌ను అన్ని విధాలుగా భారత్ ఆదుకుంటుందని మోదీ తెలిపిన మోదీ సిమ్‌టోకా జాంగ్‌లో ఓ మొక్కను కూడా నాటారు. ఇంతకు ముందు మోదీకి తశీచో జాంగ్ భవనంలో సాంప్రదాయక స్వాగతం లభించింది.
చిత్రం...భూటాన్ ప్రధాని లోటే షేరింగ్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ