అంతర్జాతీయం

రగులుతున్న ఇండోనేషియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోక్వారీ, ఆగస్టు 19: హింసాత్మక సంఘటనలతో ఇండోనేషియా అట్టుడుకుతోంది. సోమవారం పాపువా రాష్ట్ర పార్లమెంట్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. విద్యార్థుల అరెస్టుకు నిరసన ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు గుంపుపార్లమెంట్ భవనానికి నిప్పుపెట్టారని అధికారులు వెల్లడించారు. నగరంలోని ప్రధాన రహదారులపై టైర్లు తగలబెట్టి దిగ్బంధనం చేశారు. సీ పోర్టు, షాపింగ్ క్లాంపెక్స్‌కు వెళ్లే దారుల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావణం నెలకొంది. పశ్చిమ పాపువా రాజధాని మనోక్వారీ నిరసన కార్యక్రమాలతో హోరెత్తిపోయింది. రాజధానిలో పౌర జీవనం అస్థవ్యస్థంగా మారిందని గవర్నర్ మహ్మద్ లకొటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన అన్నారు. శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆందోళనకారులు, అధికారుల మధ్య చర్చలు నడుస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా పార్లమెంట్ భవనం నుంచి మంటలు,దట్టమైన పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు స్థానిక వార్తాచానళ్లలో చూపించారు. తూర్పు జావా నగరాలైన సురబయ, మలాంగ్‌లో ఆందోళనకు దిగిన పాపువా విద్యార్థులను అరెస్టు చేశారు. డార్మిటరీ యార్డ్‌లో జాతీయ పతాకాన్ని అవమానించారని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను కోతులు, కుక్కలతో పోలుస్తూ ఇంటర్నెట్‌లో పోలీసుల పోస్టులపై ఇండోనేషియా పౌరులు రగిలిపోతున్నారు. విద్యార్థులను అవమానించారని సోమవారం ఏకంగా పార్లమెంట్ భవనానికే నిప్పుపెట్టారు. కాగా 43 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరువాత విడిచిపెట్టారని ఈస్జ్ జావా పోలీసు ప్రతినిధి ఫ్రాన్స్ బరుంగ్ మంగేరా వెల్లడించారు. జాతీయ పతాకాన్ని అవమానించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు. ఇలా ఉండగా పాపువా పొరుగు రాష్ట్ర ముఖ్యపట్టణం జయపురలో వేలాది మంది నిరసన కారులు ర్యాలీలు నిర్వహించారు. తలకు బ్యాండ్‌లు ధరించి, వేర్పాటువాద పతాకంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు.