అంతర్జాతీయం

సాయాన్ని తగ్గించాక పాక్‌తో మైత్రి మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 19: పాకిస్తాన్‌కు అందిస్తున్న భద్రతా సాయంలో కోత వేసిన తర్వాత ఇరుదేశ సంబంధాలు ఇటీవలి కాలంలో మెరుగయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో సరైన చర్యలు తీసుకోని కారణంగా పాకిస్తాన్‌కు ఇస్తున్న భద్రతా సాయంలో 1.3 బిలియన్ డాలర్ల మేర కోత పెట్టామని ఆయన వివరించారు. గతంలో పాకిస్తాన్‌కు అనవసరంగా 33 బిలియన్ డాలర్ల సహాయాన్ని అమెరికా అందించిందని, దానికి ప్రతి ఫలంగా అబద్ధాలు తప్ప, అమెరికాకు ఏమీ దక్కలేదని ట్రంప్ తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్‌లోనే 1.3 బిలియన్ డాలర్ల మేర సహాయాన్ని అమెరికా నిలిపివేసింది. అప్పటి నుంచే పాకిస్తాన్‌తో తమ సంబంధాలు మెరుగయ్యాయని, నిధులు కోత పెట్టడం వల్లే ఆ దేశం దారికొచ్చిందన్న అభిప్రాయాన్ని ట్రంప్ న్యూజెర్సీలో వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగయ్యాయని పేర్కొన్న ట్రంప్, ఇటీవల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో వైట్ హౌస్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. తమ మధ్య సుహృద్భావరీతిలో సమావేశం జరిగిందని, తాను పాకిస్తాన్‌కు ఇస్తున్న సహాయంలో కోతపెట్టినా సంబంధాలు మెరుగయ్యాయే తప్ప దెబ్బతినలేదన్నారు.