అంతర్జాతీయం

ఎన్‌ఆర్‌సీ మా ఆంతరంగికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఆగస్టు 20: అస్సాంలో అక్రమ వలసలను గుర్తించడం కోసం చేపట్టిన జాతీయ పౌర జాబితా(ఎన్‌ఆర్‌సీ) భారత అంతర్గత వ్యవహారమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ నుంచి భారీగా అక్రమ వలసలు సాగుతున్నాయని కేంద్రం ఇటీవలే వెల్లడించిన నేపథ్యంలో జైశంకర్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రొహింగ్యాల సంక్షోభం, తీస్తా నీటి కేటాయింపుల అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జైశంకర్ బంగ్లాదేశ్ వచ్చారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి బంగ్లా పర్యటనకు వచ్చారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రితో తన సమావేశం సంతృప్తిని ఇచ్చిందని జైశంకర్ వెల్లడించారు. అబ్దుల్ మొమెన్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్‌ఆర్‌సీ తమ అంతర్గత వ్యవహారమని బంగ్లా విదేశాంగ మంత్రి సమక్షంలో ఆయన ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల ఆరంభంలో మీడియాతో మాడ్లాడుతూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడం కోసమే ఎన్‌ఆర్‌సీ చేపట్టినట్టు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఇరుదేశాల హోమ్‌మంత్రుల స్థాయి సమావేశంలో ఎన్‌ఆర్‌సీ అంశం చర్చకు వచ్చింది. బంగ్లాదేశ్ హోమ్ మంత్రి అసదుజ్జమన్ ఖాన్ సమక్షంలోనే అమిత్ షా ఎన్‌ఆర్‌సీ అంశాన్ని ప్రస్తావించారు.
తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఎన్‌ఆర్‌సీ అంశంపైనే ప్రధానంగా మాట్లాడడం గమనార్హం. పైగా తుది జాబితా ప్రకటనకు గడువుఈ నెలాఖరు. గత ఏడాది జాతీయ పౌర జాబితా ముసాయిదా ప్రకటించారు. అందులో 40 లక్షల మంది పేర్లు చేర్చకపోవడంతో రాజకీయ దుమారం రేపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క అస్సాం మాత్రమే కాదు, మిగతా రాష్ట్రాల్లోకి పెద్ద ఎత్తునే అక్రమ వలసల ప్రవాహం సాగుతోంది. సరిహద్దులోని దేశాల నుంచి అక్రమ వలసలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న తీస్తానదీ జలాల కేటాయింపుఅంశం పరిష్కరించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని జైశంకర్ స్పష్టం చేశారు. 2011 సెప్టెంబర్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా తీస్తా జలాల ఒప్పందం తెరమీదకు వచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరాలు తెలపడంతో ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. తీస్తా జలాలు బంగ్లాదేశ్‌కు కీలకం. డిసెంబర్ నుంచి మార్చి వరకూ బంగ్లా వాటిపైనే ఆధారపడుతుంది. నీటి వనరు అత్యంత ప్రాధాన్యత గల అంశమని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు న్యాయంగా చెందాల్సిన వాటా ఇవ్వాలన్న ఉద్దేశం తమకు ఉందని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రోహింగ్యాల సంక్షోభం త్వరగా పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. ‘సమస్యను వేగంగా పరిష్కారం కావాలి. చెదిరిపోయిన రోహింగ్యాలు క్షేమంగా మైన్మార్‌కు తిరిగి వెళ్లాలి’అని ఇరువురు విదేశాంగ మంత్రులు పేర్కొన్నారు. మైన్మార్ నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న రోహింగ్యాలతో బంగ్లాదేశ్ అనేక ఇబ్బందులు పడుతోంది. ఐరాస గణాంకాల ప్రకారం 7,45, 000 మంది రోహింగ్యా ముస్లింలు మైన్మార్ విడిచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు. బంగ్లాలోని రఖీనేలో పునరావాస శిబిరాల్లో వారు తలదాచుకుంటున్నారు.