అంతర్జాతీయం

లాత్వియాతో మరింతగా ద్వైపాక్షిక బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీగా, ఆగస్టు 20: బాల్టిక్ దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలను పెంపొందించే చర్యలను భారత్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా లాత్వియా అధ్యక్షుడు ఎగ్లిస్ లెవిటిస్‌తో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం విస్తృత చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే విషయంలో ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. అనంతరం సంయుక్తంగా ఓ మీడియా ప్రకటనను విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని, సాంస్కృతిక, విద్య, ఆర్థిక భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తామని ఈ ప్రకటనలో ఇరు దేశాలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు ద్వైపాక్షి సంబంధాలు బలోపేతం కావాలంటే ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరగాలని స్పష్టం చేశారు. ఆయుర్వేదం, యోగా, భారతీయ సంస్కృతి, సినిమాలు, వంటకాలపై లాత్వియా ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సోమవారం లాత్వియా రాజధాని రీగా చేరుకున్న వెంకయ్యనాయుడు ఐదు రోజుల పర్యటనలో భాగంగా బాల్టిక్ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్-లాత్వియా దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఈ పర్యటన ద్వారా కలిగిందని వెంకయ్యనాయుడు తెలిపారు. యూరో జోన్‌లో ఉన్న దేశాల్లో లాత్వియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లాత్వియా అధ్యక్షుడు లెబిటిస్‌తో కలిసి రెండు దేశాల అంతర్జాతీయ భాగస్వామ్యంపై కూడా చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా రెండు దేశాల మధ్య లోతైన అవగాహన ఉందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. లాత్వియా ప్రధాని క్రిస్ జిస్‌నిస్ కార్నిస్‌తో కూడా వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులను కూడా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వీరిరువురూ చర్చించారు.
చిత్రం...లాత్వియా రాజధాని రీగాలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లాత్వియా అధ్యక్షుడు ఎగాస్ లెవిట్స్