అంతర్జాతీయం

అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి కాశ్మీర్ అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామామాద్, ఆగస్టు 20: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు పాకిస్తాన్ మంగళవారం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఏఆర్‌వై న్యూస్ టీవీకి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి సూత్రప్రాయంగా తెలియజేశారు. ఈనెల ఆరో తేదీనే పాకిస్తాన్ ముఖ్యమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్లమెంట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో పాటు ఐసీజే దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అంశంతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటుచేసే నిర్ణయాన్ని భారత్ ప్రకటించిన వెంటనే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయని ఖురేషి పేర్కొన్నారు.