అంతర్జాతీయం

మోదీతో మాట్లాడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్ : ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో కాశ్మీర్ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఈ అంశంపై సాధారణ పరిస్థితులను పాదుకొల్పేందుకు ప్రయత్నించడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇరు దేశాల ప్రధానులతోను టెలిఫోన్ సంభాషణలు జరిపిన ట్రంప్ కాశ్మీర్‌పై చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యత చేకూరింది. ఫ్రాన్స్‌లో భారత ప్రధాని మోదీని కలుసుకోబోతున్నానని అని ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అమెరికా వచ్చారని, ఇద్దరు ప్రధానులతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, ఇరు దేశాలు హావిడ్జర్ ఫిరంగులను, భారీ ఆయుధాలను వినియోగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిని చల్లార్చేందుకు తనవంతుగా గట్టి ప్రయత్నం చేస్తానని, ఇద్దరు ప్రధానులతోనూ తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికమని, ఇందులో మూడో దేశ జోక్యానికి తావే లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. భారత ఉపఖండంలో కాశ్మీర్ అంశంపై ఎన్నో ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయని, అనేక సందర్భాల్లో ఇవి విఫలమయ్యాయని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణమని మతమేనని ఆయన అన్నారు. భారత్‌లో హిందువులు ఉంటే, పాకిస్తాన్‌లో ముస్లింలు ఉన్నారని తెలిపారు.