అంతర్జాతీయం

‘హౌడీ, మోదీ’కి అపూర్వ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, ఆగస్టు 21: అమెరికాలోని హూస్టన్ నగరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకడానికి భారతీయ సంతతి ప్రజలు వచ్చే నెలలో నిర్వహిస్తున్న ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 50వేలకు పైగా మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ‘హౌడీ’ అంటే నైరుతీ అమెరికా రాష్ట్రాలలో స్నేహపూర్వకంగా క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎక్కువగా ఉపయోగించే ‘హౌ డు యు డు’కు సంక్షిప్త నామం. సెప్టెంబర్‌లో హూస్టన్‌లోని ప్రతిష్టాత్మక ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడానికి 50వేల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హూస్టన్‌లోని టెక్సాస్ ఇండియా ఫోరం తెలిపింది. భారత ప్రధాన మంత్రి ఉత్తర అమెరికాలో ప్రసంగించే ఏ కార్యక్రమానికి ఇంతకు ముందెన్నడూ ఇంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదని వెల్లడించింది. అంతేకాదు, పోప్ ఫ్రాన్సిస్ మినహా అమెరికాలో ఏ విదేశీ నాయకుడి కార్యక్రమానికి కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు హాజరు కాలేదని వివరించింది. ఉచితంగా పాల్గొనే సౌకర్యం ఉన్న ఈ ఈవెంట్‌కు ఇప్పటికీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అయితే, కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు మాత్రం ఆగస్టు 29వ తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.