అంతర్జాతీయం

సంయమనమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 27: కాశ్మీర్ సమస్యపై ఉద్రిక్తతలను రగిలించే ప్రయత్నాలు విడనాడాలని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గటరెస్ భారత్-పాక్‌లకు విజ్ఞప్తి చేశారు.
ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో సెక్రెటరీ జనరల్ జరిపిన చర్చలను ఆయన ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ మీడియాకు వివరించారు. మోదీతో గటరెస్ జరిపిన చర్చలు సుదీర్ఘంగా ఫలప్రదంగా సాగాయని, ముఖ్యంగా వాతావరణ మార్పుల నిరోధానికి సంబంధించి వీరిద్దరూ విస్తృతంగా చర్చించారని తెలిపారు. వీరిమధ్య చర్చల్లో కాశ్మీర్ సమస్య కూడా ప్రస్తావనకు వచ్చిందని, అయితే దీనిని సామరస్యపూర్వకంగానే పరిష్కరించుకోవాలని, ఎలాంటి ఉద్రిక్తతలకు ఆస్కారం ఇవ్వకూడదని గటరెస్ స్పష్టం చేసినట్టు డ్యుజారిక్ తెలిపారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్‌కు సంబంధించి తమ వైఖరిని విస్పష్టంగా తెలియజేశారని, అలాగే 370 అధికరణ రద్దు పూర్తిగా తమ దేశ ఆంతరంగిక విషయమేనని కూడా ఉద్ఘాటించినట్టు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే కూడా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు క్రమంగా బలపడుతున్నాయని, అనేకచోట్ల ఆంక్షలను కూడా ఎత్తివేశామని ఐరాస చీఫ్‌కు మోదీ వివరించినట్టు గోఖలే వెల్లడించారు.
కాశ్మీర్ విషయంలో అన్నివిధాలుగా ప్రతికూలతలను ఎదుర్కొంటున్న పాక్ ప్రతి వేదికపైనా దీనిని ప్రస్తావిస్తామని తెలిపింది.
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల అనంతరం కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఐక్యరాజ్యసమితి సహా అన్నివేదికలపైనా కాశ్మీర్ సమస్యను గట్టిగా ప్రస్తావిస్తామని ఆయన ప్రకటించారు.