అంతర్జాతీయం

అక్టోబర్‌లో యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 28: అక్టోబర్‌లో యుద్ధం జరుగుతుందని, అది తమ స్వేచ్చాస్వాతంత్య్రాలకు చివరి పోరాటమని పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ భారత్‌ను హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాను ఆజాద్ (ఆక్రమిత) కాశ్మీర్‌లో పర్యటించనున్నట్టు తెలిపారు. అక్టోబర్‌లో జరిగేది రెండు దేశాల మధ్య చివరి యుద్ధమవుతుందని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితిసహా పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవాలన్న పాకిస్తాన్ ప్రయత్నం ఫలించలేదు. దీనితో నేరుగా హెచ్చరికలకు దిగినట్టు కనిపిస్తున్నది. పాక్ మంత్రి రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు కయ్యానికి కాలుదువ్వుతున్నట్టే కనిపిస్తున్నాయి. అయితే, భారత్‌తో యుద్ధానికి పాక్ సాహసిస్తుందా అన్నది అనుమానంగానే ఉంది.