అంతర్జాతీయం

ఘర్షణలతో అట్టుడికిన హాంకాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్: వరుసగా 13వ శనివారం కూడా అల్లర్లు, హింసాత్మక దాడులతో హాంకాంగ్ వీధులు అట్టుడికాయి. చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు పోలీసులపై పెట్రో బాంబులు విసిరారు. వీరిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు బాష్పవాయు ప్రయోగం చేశాయి. నీటి గోళాలను ఉపయోగించాయి. ర్యాలీలపై విధించిన ఆంక్షలను ఏమాత్రం ఖాతరు చేయని ఆందోళనకారులు అనేకచోట్ల విధ్వంస, దహనకాండకు పాల్పడ్డారు. భద్రతా కారణాల దృష్ట్యా ర్యాలీలపై పోలీసులు విధించిన నిషేధాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా లక్షలాది మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ముందస్తుగా కీలక నేతలను అరెస్టు చేసినప్పటికీ ఈ ర్యాలీల తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నల్ల టీషర్టులు ధరించిన ఆందోళనకారులు ‘హాంకాంగ్‌ను తిరిగి సాధించుకోవడం మన విప్లవం’ అని నినాదాలు చేశారు. నగరంలోని ఓ భారీ వాణిజ్య కేంద్రం పోలీసులు, ఆందోళనకారులకు మధ్య దాడులకు ప్రధాన వేదిక అయింది. ఈ పెట్రో బాంబుల కారణంగా దాదాపు అనేకచోట్ల మంటలు రగులుతూనే ఉన్నాయి. హాంకాంగ్‌లో ఆందోళనలపై దృష్టి సారించిన ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి. హాంకాంగ్ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఐరోపా యూనియన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు. తాము తెచ్చిన ఒత్తిళ్ల కారణంగానే హాంకాంగ్ విషయంలో చైనా మెతకవైఖరి అవలంబిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.