అంతర్జాతీయం

రాజకీయ చిత్తశుద్ధి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ, సెప్టెంబర్ 1: మానవ మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులను నిరోధించేందుకు ప్రపంచ దేశాలు రాజకీయ చిత్తశుద్ధితో వ్యవహరించాలని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా తొలగించాల్సిన అత్యవసర పరిస్థితులు ఆసన్నమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ మార్పులకు సంబంధించి అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఆదివారం ఒక సందేహం పంపారు. కాలుష్యం, సహజ వనరులను మితిమీరిన స్థాయిలో ఉపయోగించడం వంటి అనేక అంశాలపై రాజకీయ చైతన్యం కలిగించాలనే లక్ష్యంతోనే పోప్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా వ్యవహరిస్తే తప్ప పర్యావరణ మార్పులను నిరోధించడం సాధ్యం కాదని పేర్కొన్న ఆయన కాలుష్య ఉద్ఘారాల విసర్జన పరిమాణంపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని, ఆవిధంగా వాతావరణంలో ఉష్ణోత్రలు పెరిగిపోకుండా నిరోధించాలని పోప్ స్పష్టం చేశారు.

చిత్రం...పోప్ ఫ్రాన్సిస్