అంతర్జాతీయం

దేశాన్ని రక్షించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 1: తమ దేశ సార్వభౌమాధికారాన్ని, సుస్థిరతను పూర్తిస్థాయిలో పరిరక్షించుకుంటామని, ఈ విషయంలో దేశ ప్రజలంతా ఒక్కటిగా ముందుకు సాగుతారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ వెల్లడించారు. కాశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటనకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. కాశ్మీర్ అంశంపై ఐరోపా యూనియన్‌లో చర్చ జరుగకుండా అడ్డుకునేందుకు భారత్ విఫలయత్నం చేసిందని ఆయన అన్నారు. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తామని, ఈనెల 27న ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో తమ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడబోతున్నారని ఖురేషీ తెలిపారు. ఉద్రిక్తతలను సడలించేందుకు భారత్‌తో చర్చలు జరిపే ప్రయత్నాలను పాక్ చేపట్టందంటూ వస్తున్న కథనాలను ఆయన తిరస్కరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌తో చర్చించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ‘్భరత్ ఇటుకలతో దాడి చేస్తే మేము రాళ్లతో ప్రతిస్పందిస్తాం’ అంటూ భారత్ చర్యకు రెండింతల తీవ్రతతో పాకిస్తాన్ ప్రతిస్పందిస్తుందని ఖురేషీ అన్నారు. తమ దేశ భద్రత, సార్వభౌమత్వానికి ఎలాంటి విఘాతం కలిగినా సహించేది లేదని ఖురేషీ పునరుద్ఘాటించారు.
చిత్రం... పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ