అంతర్జాతీయం

మద్దతు ఇవ్వకపోతే.. లేబర్ పార్టీకి అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే వ్యవహారం ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టిస్తూనే ఉంది. గతంలో థెరీసా మే కూడా అనేక సమస్యల నేపథ్యంలో తప్పుకున్న అనంతరం దేశ ప్రధాని పదవి చేపట్టిన బోరిస్ జాన్సన్‌కు కూడా అధికార కన్జర్వేటివ్ పార్టీ నుంచి సెగలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్‌పై తాము తీసుకోబోతున్న నిర్ణయానికి అధికార పార్టీ సభ్యులంతా కట్టుబడి ఉండి తీరాలని, లేనిపక్షంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జర్మనీ కార్బిన్ సారథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించారు. మంగళవారం బ్రిటన్ పార్లమెంటు సమావేశం కానున్న దృష్ట్యా బ్రెగ్జిట్ అంశం తీవ్ర స్థాయిలో అలజడి సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ విషయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ వాదనను బలపరుస్తారా? లేదా అధికార పార్టీ తీసుకోబోయే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అని పార్టీ ఎంపీలను జాన్సన్ గట్టిగానే నిలదీశారు. బ్రెగ్జిట్‌పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలని వాదిస్తున్నవారికి అధికార కూటమి ఎంపీల ధోరణికి నైతికంగా బలాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. బ్రిటన్‌కు ఏవిధంగానూ నష్టం జరుగకుండా బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఐరోపా యూనియన్‌తో ఖరారు చేసుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు. ఇందుకు ఏమాత్రమైనా భిన్నసంకేతాలు కనిపించినా అది ఐరోపా యూనియన్‌కు మరింత బలానే్న ఇచ్చేది అవుతుందని యునైటెడ్ కింగ్‌డమ్ వాదనను బలహీనపరుస్తుందని ప్రధాని జాన్సన్ హెచ్చరించారు.