అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఇద్దరు భారత మెడికోల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఉక్రెయిన్‌లో ఇద్దరు భారతీయ మెడికోలు దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు భారతీయ విద్యార్థులపై స్థానికులు కొందరు కత్తులతో దాడి దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. ముజాఫర్‌నగ్‌కు చెందిన ప్రణవ్ శాండిల్య, ఘజియాబాద్‌కు చెందిన అంకుర్ సింగ్ మృతి చెందారని ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆగ్రాకు చెందిన ఇంద్రజిత్ సింగ్ చౌహాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం నాడు ఈ దాడి జరిగిందని స్వరూప్ చెప్పారు. చౌహాన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఉక్రెయిన్ దేశస్థులను అదుపులోకి తీసుకున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. మృతుల పాస్‌పోర్టులు, డాక్యుమెంట్లు తీసుకుని పారిపోతుండగా సరిహద్దులో వారిని అరెస్టు చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. దాడికి ఉపయోగించిన కత్తిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ దారుణ సంఘటనపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి ‘ఉక్రెయిన్ అధికారులతో ఎంబసీ సంప్రదింపులు జరుపుతోంది’ అని తెలిపారు. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యార్థుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌లోని ఉఝాగొరోడ్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులపై ఆదివారం ఉదయం ఆ దేశీయులు దాడి చేసినట్టు వికాస్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ దేశీయులు ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. ప్రణవ్ శాండిల్య మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అంకుర్ సింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. దాడికి గల కారణాలపై కివ్‌లోని భారత ఎంబసీ ఆరా తీస్తోందని వికాస్ స్వరూప్ వెల్లడించారు. యూనివర్శిటీ అధికారులు, స్థానిక అధికారులతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ ప్రతినిధి చెప్పారు.