అంతర్జాతీయం

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 3: తమ దేశంలోని పవిత్ర క్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చే సిక్కు యాత్రీకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. కర్తార్‌పూర్‌ను మదీనాగా, నాన్‌ఖానా సాహిబ్‌ను సిక్కులకు మక్కాగా ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన వెంటనే సిక్కు యాత్రీకులందరికీ వీసాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఒక్క భారతదేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి ఈ పవిత్ర స్థలాల సందర్శనకు వచ్చే సిక్కు ప్రజలందరికీ ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, అంతర్జాతీయ సిక్కు మహాసభలో ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ‘విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే మీ అందరికీ వీసాలు కల్పిస్తాం. ఇది పాక్ ప్రభుత్వ బాధ్యత’ అని ఆయన అన్నారు. ఈనెల 30 నాటికే ఈ వీసాల జారీ ప్రక్రియను పూర్తిచేస్తామని, నవంబర్ 2న జరిగే గురునానక్ 550వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరికి వెసులుబాటు కల్పిస్తామని ఆయన చెప్పారు. తాము ఈ చర్య తీసుకోవడానికి కారణం..ఎవరి మెప్పో పొందడానికి కాదని, సిక్కులందరూ ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చేయడమేనని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. మక్కా లేదా మదీనాకు వెళ్లకుండా ముస్లింలను ఆపడాన్ని తాము కలలో కూడా ఊహించలేమని, అదే విధంగా ఈ సిక్కుల ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా సిక్కులందరికీ పూర్తి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కొత్త వీసాల జారీ ప్రక్రియ ఆదివారం నుంచి మొదలైందని, ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులున్నా అవేవీ సిక్కు యాత్రీకులకు ఆటంకం కాబోవమని ఆయన స్పష్టం చేశారు.