అంతర్జాతీయం

మోదీకి త్వరలో ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 3: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఓ అరుదైన పురస్కారాన్ని అందుకోబోతున్నారు. స్వచ్ఛ్భారత్‌తోపాటు నిరుపమాన నాయకత్వ పటిమను కనబరుస్తున్నందుకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డును మోదీకి అందించాలని బిల్ మిలిందా గేట్ ఫౌండేషన్ నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ఇక్కడకు రానున్న మోదీ గ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో కూడా మాట్లాడతారు. ఆ సందర్భంగానే మోదీ ఈ పురస్కారాన్ని అందుకుంటారు. తమ దేశంలో చేపట్టిన చర్యల ద్వారా అంతర్జాతీయ లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించే ఓ రాజకీయ నాయకుడి సామర్థ్యానికి గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుందని ఫౌండేషన్ తెలిపింది. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా యావత్ ప్రపంచాన్ని మోదీ ఆకర్షించారని పేర్కొంది. 2014 అక్టోబర్ 2న భారత్‌లో మొదలైన స్వచ్ఛ భారత్ అంతర్జాతీయంగా అనేక దేశాల దృష్టిని ఆకర్షించింది. మహాత్ముడి 150వ జయంతి నాటికి పూర్తి స్థాయి పారిశుద్ధ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ మిషన్‌ను చేపట్టింది.