అంతర్జాతీయం

ఒకే లక్ష్యం.. శైలి భిన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్, సెప్టెంబర్ 8: న్యాయవాదులుగా తాము పొందిన శిక్షణ, సముపార్జించుకున్న అనుభవాన్ని ఆయుధంగా చేసుకుని తమ తమ దేశాల్లో అద్వితీయంగా స్వాతంత్య్రోమాలను మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నిర్వహించగలిగారని ఇక్కడ జరిగిన ఒక సదస్సులో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. లాయర్లుగా మహాత్మాగాంధీ, మండేలా అనే అంశంపై దక్షిణాఫ్రికా యూనివర్సిటీలో ఈ సదస్సు జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్ జయదీప్ సర్కార్, దక్షిణాఫ్రికా రాజ్యాంగకోర్టు న్యాయవాది అల్‌బీ సచ్, కేప్‌టౌన్‌కు చెందిన ఇమ్రాన్ కువాడియా తదితరులు పాల్గొన్నారు. తమ తమ లక్ష్యాలను సాధించడంలో మహాత్మాగాంధీ, మండేలా అహింసా మార్గానే్న అనుసరించినా తమ తమ ప్రత్యేక ఆలోచనలతోనే ముందుకు వెళ్లారని వక్తలు తెలిపారు. వీరిద్దరిలో ఎంతో సారూప్యత ఉంది, అదే స్థాయిలో తీవ్ర తేడాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో 20 సంవత్సరాలపాటు ఉన్న మహాత్మాగాంధీ అక్కడే సత్యాగ్రహ సూత్రాలను ఆకళింపుజేసుకున్నారని, అనంతరం భారత్‌కు తిరిగి వెళ్లిన ఆయన స్వాతంత్య్రోద్యమానికి సారథ్యం వహించారని తెలిపారు. తనపై మహాత్మాగాంధీ ప్రభావం గురించి మండేలా ఎన్నో సందర్భాల్లో చెప్పేవారని, పుస్తకాల్లో కూడా ప్రస్తావించారని వక్తలు గుర్తు చేశారు. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, అలాగే నెల్సన్ మండేలా కూడా జన్మించి వందేళ్లు కావడం యాదృచ్ఛికమని అన్నారు. ఇద్దరి జయంతి ఒకే ఏడాది వస్తోందని కాబట్టి, వీరి ఆలోచనలు, విలువలు, సిద్ధాంతాలు తులనాత్మక రీతిలో వెలుగులోకి తేవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు.
చిత్రాలు..