అంతర్జాతీయం

ఇస్రోతో కలిసి పనిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 8: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి సంయుక్తంగా రోదసీ పరిశోధనలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పేస్ ఏజన్సీ (నాసా) వెల్లడించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2ను శ్లాఘించిన నాసా ‘అంతరిక్షం అన్నది చాలా కఠినం. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌ను దింపాలన్న ఇస్రో ప్రయత్నం ప్రశంసనీయం’ అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
దాదాపుగా చంద్రుడికి చంద్రయన్ చేరువైన తీరు తమకెంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో ఇస్రోతో కలసి మన సౌరవ్యవస్థలోని ఎన్నో రహస్యాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ దగ్గర దాకా వెళ్లడం ద్వారా ఇస్రో సాధించిన విజయం అత్యంత ప్రశంసనీయమని, భవిష్యత్తులో శాస్త్ర పరిశోధనలకు ఎంతో దోహదం చేసే సమాచారాన్ని భారత్ ఇవ్వగలదన్న ఆశాభావాన్ని నాసా వ్యక్తం చేసింది. నిర్దేశించుకున్న అంతరిక్ష లక్ష్యాలన్నింటినీ భారత్ కచ్చితంగా సాధించగలుగుతుందని ట్రంప్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను ఇస్రో తీసుకుందని, ఈ ప్రయత్నంలోనే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడం వల్ల చంద్రుడి ముంగిట ఈ ప్రయోగం ఆగిపోయిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో తాము జరుపబోయే ప్రయోగాలకు కూడా ఇస్రో ఎదుర్కొన్న సమస్య తమకెంతగానో సహకరిస్తుందనే నాసా మాజీ వ్యోమగామి జెర్రీ లినెంజర్ అశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజా అవరోధానికి నిరాశపడాల్సిన అవసరం లేదని, భారతదేశం అత్యంత కఠినమైన లక్ష్యాన్ని ఎంచుకుందని, దానిని సాధించేందుకు గట్టి ప్రయత్నమే చేసిందని ఆయన అన్నారు. చంద్రుడి దక్షిణధృవంపై రోవర్‌ను సజావుగా దింపేందుకు భారత్ చేసిన ప్రయత్నం ప్రస్తుతం ఫలించకపోయినా ఈ చారిత్రక యత్నం మాత్రం భారతదేశ శాస్త్ర సాంకేతిక పాటవానికి నిదర్శనమని గ్లోబల్ మీడియా వ్యాఖ్యానించింది. న్యూయార్క్ టైమ్స్ కూడా దశాబ్దాలపాటు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సాధించిన విజయానికి ఇది ప్రతీక అని పేర్కొంది.
తొలి ప్రయత్నంలోనే చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగలేకపోయినా ఈ దిశగా భారత్ చేసిన కృషి కళ్లకు కడుతోందని తెలిపింది. చంద్రయాన్-2 మిషన్‌లో భారత్‌ది పాక్షిక వైఫల్యమేనని, దాదాపుగా ఇతర నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అది అందుకోగలిగిందని తెలిపింది. సామాజిక మీడియాలో కూడా ఇస్రోపై ప్రశంసలు వెల్లువెత్తాయి.