అంతర్జాతీయం

మోదీ వ్యాఖ్యలను ఖండించిన బలూచిస్తాన్ అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బలూచిస్తాన్ గురించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతేకుండా ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఫెడరల్ (కేంద్ర) ప్రభుత్వాన్ని కోరింది. అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఎమ్మెల్యే ముహమ్మద్ ఖాన్ లెహ్రీ శనివారం ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అసెంబ్లీలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానంపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా జెహ్రీతో పాటు పలువురు ఇతర శాసనసభ్యులు కూడా సంతకాలు చేశారు. బలూచిస్తాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని వారు ఈ తీర్మానంలో ఆరోపించారు. బలూచిస్తాన్ విషయంలో భారత ప్రధాని పాక్ సార్వభౌమత్వాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘించారని లెహ్రీ వ్యాఖ్యానించాడు.