అంతర్జాతీయం

టోక్యో ప్రాంతాన్ని వణికిస్తున్న ‘ఫాక్సాయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: ఫాక్సాయి తుపాను మరింత బలపడి ఆదివారం రాత్రి టోక్యో ప్రాంతాన్ని తాకింది. దీని ప్రభావంతో ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుపాను కారణంగా రవాణా వ్యవస్థకు కూడా అంతరాయం కలిగింది. గంటకు 216 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో దూసుకొస్తున్న ఫాక్సాయి సోమవారం తెల్లవారు జామున జపాన్ రాజధాని నగరమయిన టోక్యోను తాకుతుందని అంచనా. ఒక లక్షా పది వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫాక్సాయి ప్రభావంతో కురిసే వర్షాలు, వీచే గాలులు రికార్డు స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీచే పెనుగాలులు, ఎగిసిపడే అలలు, విరిగిపడే కొండచరియలు, పోటెత్తే వరదలు, పొంగిపొర్లే నదుల కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఫాక్సాయి తుపాను సోమవారం ఉదయం టోక్యో నగరాన్ని అతలాకుతలం చేస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు ప్రధాన లైన్లలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వంద బుల్లెట్ రైళ్ల రాకపోకలను ఆదివారమే నిలిపివేశారు.