అంతర్జాతీయం

చైనావి రక్షిత విధానాలు.. అందుకే వాణిజ్య లోటు తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, సెప్టెంబర్ 9: చైనా అనుసరిస్తున్న రక్షిత విధానాల వల్ల భారత్‌కు దానికి మధ్య ఉన్న వాణిజ్య లోటు తీవ్రంగా పెరిగిపోయిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. దీని దృష్ట్యానే మెగా స్వేచ్చ వాణిజ్య ఒప్పందం ‘రిసెప్’లో చేరే విషయంలో తమకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్-చైనాల మధ్య వాణిజ్య లోటు 2014 నాటికే 57 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రతిపాదిస్తున్నాయి. దీనిపై 10 అసియా దేశాలు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా చర్చలు జరుపుతున్నాయి. భారత్, సింగపూర్ వ్యాపార శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడిన జైశంకర్ భారత్ ఉత్పత్తులకు సరైన మార్కెట్ సంథానత లేదని, పైగా చైనా రక్షిత విధానాలను అవలంభిస్తున్నదని అన్నారు. దీని కారణంగానే రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు అపరిమితంగా పెరిగిపోయిందని ఆయన తెలిపారు. అయితే ఈ దేశాల కూటమిలో చైనా కూడా ఉండడం పట్ల భారత పరిశ్రమలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయని, ‘రిసెప్’ ఒప్పందంపై చర్చలు జరిపే విషయంలో తమ వాణిజ్య ఒప్పందాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరాయని అన్నారు. చైనా మార్కెట్‌లో భారత్ ఫార్మా, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన స్థానం కల్పించాలని భారత్ అనేక సందర్భాల్లో డిమాండ్ చేసిందని చెప్పారు. వాణిజ్య లోటును తగ్గించుకోవాలన్న ఉద్ధేశ్యంతోనే తాము ఈ ప్రయత్నం చేశామని, అయినా ఏ రకమైన ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన అన్నారు. చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా ఎగుమతులు డంపింగ్ జరగడం వల్ల వాటిపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించామని జైశంకర్ తెలిపారు. తాజాగా 16 దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరితే ఈ దేశాల మార్కెట్‌లోకి చైనా వస్తువులు వెల్లువెత్తుతాయని అన్నారు.